TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొనసాగుతోంది. ఎకరానికి 12 వేల రూపాయలను అందించే ఈ పథకం ద్వారా వానాకాలం సీజన్ ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు.

శనివారం ఒక్కరోజే 8 ఎకరాలు ఉన్న రైతులకు 48 వేల రూపాయలను వారి వారి ఖాతాలలో జమ చేశారు. అందుకు కాను ప్రభుత్వం 905.89 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దాంతో ఆరు రోజులకే 8 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా ఖాతాలలో నిధులు జామ అయ్యాయి.

ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ద్వారా సీజన్ రైతు భరోసా పథకాన్ని నిధులు విడుదల చేశారు. శనివారం నాటికి 7 ఎకరాల వరకు వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకాన్ని నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఎనిమిది ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేశారు.

ఒక్కొక్క రైతుకు 8 ఎకరాలకు గాను 48 వేల రూపాయలను వారి వారి ఖాతాలలో జమ చేశారు. ఈనెల 24వ తేదీ నాటికి తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా రైతులకు అందజేయనున్నారు.

ఇది ఇలా ఉండగా రైతు భరోసా రాని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా అందని రైతులు ఆందోళన చెందవద్దని వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. వ్యవసాయ విస్తరణ అధికారి వద్దకు వెళ్లి దరఖాస్తు ఫారం తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ తో పాటు జిరాక్స్ ప్రతులను వెంటనే అందజేయాలని కోరారు.

రైతులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారులు జిల్లా అధికారులకు పంపడంతో వెంటనే వారికి కూడా రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ అవుతాయని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆలస్యం చేయవద్దని కోరారు. ఆలస్యం చేస్తే నిధులు జమ కావడం ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.

MOST READ : 

  1. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  2. Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

మరిన్ని వార్తలు