TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు ప్రస్తుత వానాకాలం సీజన్ లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయకట్టు రైతులు వరి సాగుపై దృష్టి పెట్టి పనుల్లో ఉండగా, ఆయకట్టేతర రైతులు ఇప్పటికే మెట్ట పంటలు సాగు చేశారు. ఈ సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటల సాగు సమృద్ధి గానే చేస్తున్నారు.

కానీ వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంటల సహాయం ఇప్పటికీ కూడా ఇంకా అందలేదు. పంటల సహాయాన్ని ప్రభుత్వం ఈ సీజన్ కు ముందే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ పనులకు అవసరమయ్యే ఖర్చులు పంటల సహాయంగా ప్రభుత్వం రైతు భరోసా ద్వారా అందిస్తుందని ఎదురుచూస్తున్నారు.

అభిప్రాయ సేకరణ :

గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అనర్హులైన రైతులకు కూడా నిధులు చెల్లించింది. వ్యవసాయ భూములకే కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా రైతుబంధు డబ్బులు చెల్లించింది. అంతేకాకుండా చిన్న రైతులకు మాత్రమే పడకుండా పడడంతో పాటు వందల ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతుబంధు అందించింది.

దాంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సహాయం చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 వేల రూపాయల సహాయం చేయనున్నది. రైతు భరోసా పథకం లో మార్పులు చేర్పులు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతు వేదికల్లో అభిప్రాయ సేకరణ చేపట్టగా ఇంకా రెండు, మూడు జిల్లాల్లో పూర్తి చేయాల్సి ఉంది.

రైతు భరోసా కు కట్ ఆఫ్ :

రైతు భరోసా పథకంలో రైతులకు పంట సహాయం అందించడానికి ప్రభుత్వం కటాఫ్ ను నిర్ణయించే అవకాశం ఉంది. రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు పంటలు సాగు చేసుకునే రైతులకు మాత్రమే సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వ్యవసాయతర భూములకు, సాగు చేయని పడవు భూములకు రైతు భరోసా అందించే అవకాశాలు లేవు.

అంతే కాకుండా ఐదు ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ భూములు ఉన్న రైతులకు రైతు భరోసా అందించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్కువ జిల్లాలలో రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

రైతుల అభిప్రాయాల మేరకు రైతు భరోసాను ప్రభుత్వం అందించే అవకాశాలు ఉన్నాయి. అందుకుగాను ఈ వానకాలం సీజన్ ఆలస్యమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ సాగు సీజన్ ప్రారంభమైనందున రైతు భరోసా అందించాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

వర్షాకాలం జాగ్రత్త.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!

మరిన్ని వార్తలు