Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : సాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలి.. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై బైఠాయించిన రైతులు..! 

Miryalaguda : సాగర్ వరద కాలువకు నీటిని విడుదల చేయాలి.. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై బైఠాయించిన రైతులు..! 

మాడుగులపల్లి, మన సాక్షి :
నాగార్జున సాగర్ వరద కాలువకు నీటిని విడుదల, చేయాలని వివిధ గ్రామాల రైతులు నార్కెట్పల్లి- అద్దంకి హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో నాలుగు కిలోమీటర్ల మేరకు వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయిన ఘటన మాడుగులపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది..

నాగార్జునసాగర్ నుండి నేరుగా పలు గ్రామాలను అనుసంధానం చేసుకుంటూ రైతులకు వ్యవసాయానికి నీరు అందిస్తున్న వరద కాలువ (లో వెల్ కాలువ) కు నీరుని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. నీరు విడుదల చేసినప్పటికీ కొంతమంది అక్రమార్కులు రైతులకి నీరు అందకుండా కాలువ తూములను ధ్వంసం చేసి నీటిని మళ్లించి అన్యక్రాంతం చేస్తున్నారని  అన్నారు.

దాని వల్ల తామంతా నష్టపోతున్నామని నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం పరిధిలోని గ్రామాలైన దాచారం, నానాపురం, కనేకల్, చెరువుపల్లి, మాడుగులపల్లి, కుక్కడం, తోపుచర్ల, సీత్యాతండా మొదలగు పలు గ్రామాల రైతులు సోమవారం మాడుగులపల్లి మండల కేంద్రంలోని అద్దంకి- నార్కట్ పల్లి రహదారిపై బెటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

దీంతో ఇరు వైపులా నాలుగు కిలోమీటర్ల మేరకు భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..దీంతో రంగ ప్రవేశం చేసిన వేములపల్లి, మాడుగులపల్లి ఎస్ఐ లు దాచేపల్లి విజయ్ కుమార్, శోభన్ బాబులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడం జరిగింది.

విషయం తెలుసుకున్న మండల తహసిల్దార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి నీరు అందరికీ అందే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించడం జరిగింది.

ALSO READ : 

Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!

TGSRTC : మహిళా కండక్టర్ మానవత్వం.. ఆర్టీసీ బస్సులో గర్భిణీ ప్రసవం..!

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

ప్రతిభకు దక్కిన గౌరవం.. రాష్ట్ర స్థాయి ప్రథమ అవార్డు సొంతం..!

మరిన్ని వార్తలు