Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!
Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!
తొర్రూర్, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్ పీఎసీసీ కేంద్రం వద్ద ఉదయం లేచినకాండలే సాయంత్రం వరకు క్యూలో నిలబడిన కూడా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత వల్ల రైతులు ధర్నాకు దిగారు.గత పది రోజులుగా యూరియా కోసం పనులు మానుకొని పరికాపలు కాస్తున్న కూడా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు. నాట్లు వేసి దాదాపుగా నెల రోజులు అవుతున్నాయి… కొన్ని పొలాల్లో ఎరువుల కొరత వల్ల వరి ఎండిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను ఎందుకు సరఫరా చేయలేకపోతున్నాయి వాపోతున్నారు.
రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో రైతులకు యూరియా కొరతే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పరిస్థితి ఎందుకు?” అని ప్రశ్నించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవ చూపి యూరియాతో పాటు అవసరమైన ఎరువులు కూడా సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులుతో పాటుగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ :
-
Huzurnagar : హుజూర్‌నగర్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!









