Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!

Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!
పెన్ పహాడ్, మనసాక్షి:
కర్షకుల కష్టంపై ఎవ్వరు మాట్లాడరేం అని రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా యూరియా సరఫరా చెయ్యాలి అని సిపిఎం ఆధ్వర్యంలో పెన్ పహాడ్ మండల కేంద్రంలో రైతులతో మూడు గంటల పాటు రాస్తారోకో బుధవారం నిర్వహించినారు.
రైతులకు యూరియా వచ్చేంత వరకు పోరాటం ఆగదు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. గత నెల రోజుల నుంచి వరి నాట్లు పెట్టుకున్న రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడం తో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం నుంచి రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్న కాని ఒక్క బస్తా యూరియా దొరకక పోవడం తో కడుపు మంటతో రగిలి పోతున్నారని అన్నారు.
మండలం లో వివిధ గ్రామాలలో రైతుల దుస్థితి చూసి పెన్ పహాడ్ సహకార సంఘం కార్యాలయం ముందు రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగిందన్నారు,
కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేక పోవడం తో ప్రయివేట్ నానో కంపెనీలకు లొంగిపోవడం వల్ల డిమాండ్ ఆధారంగా ఇండెక్స్ 72 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా ను 62 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వరకే ఇండెక్స్ పేరు పెట్టడం రైతుల పట్ల చూపిస్తున్న సవతితల్లి ప్రేమే మాత్రమేనని నెమ్మాది ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు బిజెపి మంత్రులు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన తెప్పించడం లో పూర్తిగా విఫలం చెందారని నెమ్మాది ఆరోపించారు.చిన్న సన్న కారు దళిత, గిరిజన రైతులు
బయట కొనలేక ఇప్పటికే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి వరి సాగు చేస్తే ఒక్క యూరియా బస్తా కొరకు రైతులు రోడ్ల మీదకు రావల్సిన పరిస్థితి దాపురించిందనీ నెమ్మాది ఆరోపించారు..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాట కొరకు డిల్లీ లో కొట్లాడి తెప్పించాలని డిమాండ్ చేశారు. పెన్ పహాడ్ మండలం లో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయక పోతే మళ్ళీ రైతుల తరుపున పోరాటం చేస్తామని నెమ్మాది హెచ్చరించారు.
ఈ రాస్తారోకో లో సీపీఎం జిల్లా కమిటి సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, వీర బోయిన రవి, సిపిఎం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, సిపిఎం మండల నాయకులు రనపంగ కృష్ణ, నెమ్మాది ఆడివయ్య, ఇరుగు రమేష్, ఫీరయ్య ,భోగరాజు శ్రీకాంత్, ముత్తయ్య, శివ, లక్ష్మయ్య, లక్ష్మమ్మ, నాగు, వెంకన్న, సోమయ్య, వెంకటమ్మ, జానీ తదితరులు పాల్గొన్నారు
MOST READ :
-
Aadhaar Centers : మనసాక్షి కథనానికి స్పందన.. దేవరకొండలో ఆధార్ కేంద్రాలలో అధిక రుసుము వసూళ్లపై అధికారుల విచారణ…!
-
Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
ACB : రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని మనిహరీక..!
-
TVS : భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్..!
-
Miryalaguda : రైతులకు యూరియా కష్టాలు..!









