District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ సూచన..!

District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ సూచన..!
పెద్దపల్లి (ధర్మారం) మన సాక్షి:
రాగల 3 రోజులలో అధిక ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రాగల మూడు రోజుల వరకు (ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30) వాతావరణ విశ్లేషణ వాతావరణ శాఖ అందించిందని తెలిపారు.
ఏప్రిల్ 27న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్య అవకాశం ఉందని తెలిపారు.
ఏప్రిల్ 27న జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు పెద్దపల్లి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రిల సెల్సియస్ ఉష్ణోగ్రత నవోదయ అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో వడ గాల్పులు వీచే అవకాశం , రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని , ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
PM Kisan : పీఎం కిసాన్ రైతులకు కీలక అప్డేట్.. ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!
-
Hyderabad : సికింద్రాబాద్ లో గుట్టలుగా నోట్ల కట్టలు.. స్థానికంగా కలకలం..!
-
Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!
-
Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!









