Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Narayanpet : ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో టీజీఎండిసి ద్వారా నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు.

మాగనూర్ మండలం అడవి సత్యవార్ కు చెందిన నలుగురు రైతులు, వర్కూర్ కు చెందిన మరో రైతు తమ పట్టా భూముల నుంచి ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా శనివారం నాటి సమావేశంలో ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల,వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

సమావేశంలో మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదికలన్ని సరిగ్గా ఉన్నాయని, దరఖాస్తుదారుల పట్టా భూముల నుంచి ఇసుక తొలగించేందుకు అనుమతులు ఇవ్వ వచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అన్ని శాఖల అధికారులు రిపోర్టుల ఆధారంగా అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే టీజీఎండీసి ద్వారా ఆయా భూములలో ఉన్న ఇసుకను తరలించేందుకు ఎన్ని వాహనాలు అవసరమవుతాయని, ఎన్ని రోజుల సమయం పడుతుందని, రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించ వచ్చని అధికారులతో చర్చించారు. ఇసుక తరలించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

అయితే రెవిన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఇసుక తరలింపు పై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రీచ్ ల నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాలని మగనూరు ఎస్.ఐ. ని ఆదేశించారు.

రెవెన్యూ అధికారితో కలిసి ఇసుక రీచ్ లను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీవో రామచందర్ నాయక్, డి.ఎస్.పి. నల్లపు లింగయ్య, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, ఆర్టీవో మేఘా గాంధీ, టీజీఎండిసి అధికారి రంగారెడ్డి, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి, జిల్లాకు చెందిన తహాసిల్దార్లు, సిఐలు,ఎస్.ఐ. లు, కలెక్టరేట్ లోని సంబంధిత సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!

  2. District collector : ప్రతి రైతుకు ఆధార్ తరహాలో భూధర్ కార్డు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  3. Narayanpet : చిల్డ్రన్స్ హోమ్ సీనియర్ సివిల్ జడ్జి ఆకస్మిక తనిఖీ..!

  4. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

మరిన్ని వార్తలు