Breaking Newsఆదిలాబాద్జిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం
ఆదిలాబాద్ జిల్లాలో చెప్పుతో కొట్టుకొని రైతులు వినూతన నిరసన..!
అదిలాబాద్ జిల్లాలో రైతులు తన చెప్పుతో తానే కొట్టుకొని వినూతన నిరసన తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో చెప్పుతో కొట్టుకొని రైతులు వినూతన నిరసన..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
అదిలాబాద్ జిల్లాలో రైతులు తన చెప్పుతో తానే కొట్టుకొని వినూతన నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఆదిలాబాద్ జిల్లా ముకార కె గ్రామంలో రైతులు అర్ధ నగ్నంగా చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదని, గత ప్రభుత్వ హాయంలో 24 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇచ్చే వారిని రైతులు పేర్కొన్నారు. వానాకాలం సీజన్ లో కరెంట్ సక్రమంగా లేక పంటలు సరిగా పంటలు లేకపోవడంతో పాటు యాసంగి లో పంటలు వేయవద్దని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేశామని నిరసన తెలిపారు.









