Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..!

రైతులకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. వ్యవసాయ విద్యుత్ పై నిర్లక్ష్యం వీడాలి. రైతులకు న్యాయం చేయాలి. విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని మండల కేంద్రంలో గల ప్రధాన రహదారిపై శనివారం రైతులు బైఠాయించి మెరుపు ధర్నా నిర్వహించారు.

కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు..!

నడిగూడెం, మన సాక్షి :

రైతులకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. వ్యవసాయ విద్యుత్ పై నిర్లక్ష్యం వీడాలి. రైతులకు న్యాయం చేయాలి. విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని మండల కేంద్రంలో గల ప్రధాన రహదారిపై శనివారం రైతులు బైఠాయించి మెరుపు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు కనీసం 7:00 గంటల కరెంటు ఇవ్వట్లేదని, తాము లక్షల్లో పెట్టుబడి పెట్టి కళ్ళముంది పంట పొలాలు ఎండిపోతుంటే బాధేస్తుందని రైతులు వాపోయారు. విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు తమ మెడలో విద్యుత్ వైర్ వేసుకొని నిరసన తెలియపరిచారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై తేజస్విని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రైతుల సమస్యలను స్థానిక విద్యుత్ ఏ.ఈ వెంకట గణేష్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ.ఈ ట్రాన్స్ఫారం సాంకేతిక సమస్య వల్ల కరెంట్ సప్లై లో కోతలు విధిస్తున్నామని, మంగళవారం నాటికి విద్యుత్ సమస్యలను అధిగమించి రైతులకు న్యాయమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమింప వేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు నక్క సైదులు, గుండు శ్రీను, దున్న ప్రవీణ్, తంగేళ్ళ మహేష్, మహమ్మద్ రఫీ, ఎస్కే జలీల్, బెల్లంకొండ సత్యనారాయణ, జాన్ షరీఫ్, గునుగుంట్ల పోతురాజు, చెమట వీరబాబు, తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు