క్రైంBreaking Newsజనగామ జిల్లాజిల్లా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు..!

జనగామ, మన సాక్షి :

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన సంఘటన పాలకుర్తి మండలం లో చోటుచేసుకుంది. తొర్రూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు హైదరాబాదు నుండి జనగామ, పాలకుర్తి మీదుగా తొర్రూరు వెళ్లాల్సి ఉంది.

కాగా మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరిన బస్సు పాలకుర్తి మండలం వావిలాల మల్లంపల్లి సబ్ స్టేషన్ మూలమలుపు వద్ద కు రాగానే లారీ ఢీ కొట్టింది. దాంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.

మృతులు తొర్రూరు మండలం వెలికట్టే టీకే తండకు చెందిన దంపతులు జటోత్ బుజ్జి, జటోత్ ఇమ్మని, పాలకుర్తి కేంద్రానికి చెందిన నసీమ మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

LATEST UPDATE : 

Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

Nirmal : కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల..!

మరిన్ని వార్తలు