AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో తుడుములదిన్నె గ్రామంలో మద్యం మత్తులో ముగ్గురు పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో తుడుములదిన్నె గ్రామంలో మద్యం మత్తులో ముగ్గురు పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొన్నది. స్థానికుల సమాచారం మేరకు తొడుములదిన్నే గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో చిన్నారులు కావ్య (7) జ్ఞానేశ్వరి (4) సూర్య గగన్ (2)గా గుర్తించారు. పిల్లల తల్లి ఎనిమిది నెలల క్రితమే మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చునని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!
-
TG News : గురుకులంలో దారుణం.. విద్యార్థినిని ప్రత్యక్షణారహితంగా కొట్టిన వార్డెన్..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!
-
MLC Shankar Naik : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్..!