Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Fertilizer : ఈ పాస్ యంత్రం ద్వారానే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!
Fertilizer : ఈ పాస్ యంత్రం ద్వారానే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!
మల్లాపూర్, మన సాక్షి :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సాతారం మల్లాపూర్ మొగిలిపేట్ సిరిపూర్ రాఘవపేట్ గ్రామాలలో ఎరువుల దుకాణాలను జిల్లావ్యవసాయ అధికారి రామచందర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మిషన్ పరిశీలించారు. డీలర్స్ తప్పనిసరిగా ఎరువులను ఈ పాస్ యంత్రం ద్వారానే అమ్మాలని తెలిపారు. విత్తనాలు పురుగుమందులు అమ్మేటప్పుడు రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని తెలిపారు.
అలాగే రాఘవపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు వరి ధాన్యంలో తేమశాతం 17% వచ్చేవరకు ఆరబెట్టాలని తెలిపారు. ఆతని వెంట వ్యవసాయ అధికారి లావణ్య వ్యవసాయ విస్తరణ అధికారి గజనంద్ ఉన్నారు.
MOST READ :









