తెలంగాణBreaking News
TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!
TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!
హుజుర్నగర్, (మనసాక్షి):
ప్రపంచ బియ్యం ఎగుమతి మార్కెట్‌లో తెలంగాణ చారిత్రాత్మక అడుగుపెట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యం ఫిలిప్పీన్స్‌కు వెళ్లనుండగా, ఈరోజు కాకినాడ పోర్టు నుంచి మొదటి సరుకును పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ సీనియర్ అధికారులు, ఫిలిప్పీన్స్ ప్రతినిధి బృందం సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ బియ్యం అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతుండటం రాష్ట్ర ఆర్థిక రంగానికి కొత్త అవకాశాలను తెరవనుందని అధికారులు తెలిపారు.
MOST READ :









