KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!
టేక్మాల్, మన సాక్షి:
బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై ఉన్న అభిమానంతో తనకు పుట్టిన కొడుకుకు కెసిఆర్ పేరును నామకరణం చేసిన అబిమని చిరంజీవి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామానికి చెందిన జక్కుల చిరంజీవి, చిత్ర దంపతులకు 5గురు సంతానం.
ముగ్గురు ఆడ పిల్లలు, ఇద్దరు కొడుకులు.. అయితే ఐదవ సంతానంలో కొడుకుకు పుడితే తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ పేరు పెట్టుకోవాలని అనుకున్నాడు. అనుకున్న విదంగానే మే నెల 21తేదీన కొడుకు పుట్టాడు. దింతో నామకరణ రోజున అనుకున్న విదంగా కొడుకుకు జక్కుల కెసిఆర్ పేరు పెట్టి కెసిఆర్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.
శనివారం చిరంజీవి జక్కుల కెసిఆర్ అనే పేరుతో బర్త్ సర్టిఫికెట్ తీసుకొని తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. అతని వెంట బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జక్కుల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
MOST READ :
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. విద్యార్థులకు వాటి పట్ల పూర్తి అవగాహన కల్పించాలి..!
-
TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!
-
MITS : క్యూఎన్ఎక్స్ తో కీలక ఒప్పందంపై హర్షాతిరేకం.. టెక్నాలజీ రంగంలో మిట్స్ కు మరో మైలురాయి..!
-
IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!
-
Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!









