Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్విద్య

MITS : క్యూఎన్ఎక్స్ తో కీలక ఒప్పందంపై హర్షాతిరేకం.. టెక్నాలజీ రంగంలో మిట్స్ కు మరో మైలురాయి..!

MITS : క్యూఎన్ఎక్స్ తో కీలక ఒప్పందంపై హర్షాతిరేకం.. టెక్నాలజీ రంగంలో మిట్స్ కు మరో మైలురాయి..!

మదనపల్లి, మన సాక్షి :

ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్‌బెర్రీ క్యూ ఎన్ఎక్స్ తో భాగస్వామ్య ఒప్పందం కుదరడం మా కళాశాలకు ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆ కళాశాల అధినేత, కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల విజయ భాస్కర్ చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో స్క్వేర్ టెక్నాలజీస్ సీఈఓ శ్రీనివాసరాజు, అనలిస్ట్ మధుసూధన్, క్యూ ఎన్ఎక్స్ ఎవ్రీవేర్ డైరెక్టర్ దశరధ్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని పురస్కరించుకుని విజయభాస్కర్ చౌదరి ఈ ఒప్పందం ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఒప్పంధంతో విద్యార్థులకు పరిశ్రమతో అనుసంధానమైన విద్య, ఎంబడెడ్ టెక్నాలజీపై శిక్షణ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రాక్టికల్ విజ్ఞానం అందుతుందన్నారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా సాంకేతిక నైపుణ్యం పొందగలిగే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తాజా టెక్నాలపై ప్యాకల్టీకి కూడా శిక్షణ అవగాహన కార్యక్రమాలు లభిస్తాయన్నారు. క్యూ ఎన్ఎక్స్ మిట్స్ ఒప్పందం టెక్నాలజీ రంగంలో కీలక ముందడుగు పడినట్లేనన్నారు.

విద్య, పరిశ్రమ అనుసంధానానికి సరి కొత్త మార్గం ఏర్పడుతుందన్నారు. క్యూఎన్ఎక్స్ భాగస్వామ్యం మా విద్యార్థులకు, ప్యాకల్టీకి అనుభవాన్ని అంతకు మించి ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుందన్న గట్టి ధీమాను వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. Accident : ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని ముగ్గురు సజీవ దహనం..!

  2. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

  3. Hyderabad : మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర జ్వరం.. ఆసుపత్రిలో చేరిక..!

  4. Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!

మరిన్ని వార్తలు