Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ – మదీనా కు విమాన సేవలు..!

Hyderabad : హైదరాబాద్ – మదీనా కు విమాన సేవలు..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో కలిసి హైదరాబాద్- మదీనాకు కొత్త విమాన సేవలను శుక్రవారం ప్రారంభించింది. తొలి విమానం ఆనందోత్సాహం మధ్య సీనియర్ అధికారుల సమక్షంలో శుక్రవారం బయలుదేరింది.

ఈ సేవ ప్రతి వారం మూడు రోజులు పాటు ఉంటాయని తెలిపారు. ఈ విమాన సర్వీసులు సోమ. గురు, శనివారం అందుబాటులో ఉంటాయి. గమ్యస్థానం చేరడానికి సుమారు 5 గంటలు 47 నిమిషాలు. పడుతుందని వివరించారు. ఈ కొత్త సేవతో అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ, “మదీనాకు ఇండిగో తొలి విమానాన్ని స్వాగతించడం ఎంతో సంతోషకరమైన విషయం. అన్నారు. ఈ కొత్త మార్గం మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, హైదరాబాదును ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటైన మదీనాతో అనుసంధానించే ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని ప్రయాణీకులకు అందిస్తుందని తెలిపారు.

అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల విస్తరణకు మద్దతు ఇవ్వడం ప్రయాణికులకు సులభమైన సేవలు అందించడానికి కట్టుబడి ఉంటామని అన్నారు. దక్షిణాసియా – ఆగ్నేయాసియాలోని ప్రయాణికులకు ఇప్పుడు హైదరాబాదులో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ హబ్ ద్వారా మరిన్ని ప్రయాణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

MOST READ :

  1. Cm Revanth Reddy : మహిళా సంఘాలకు డ్రస్ కోడ్.. వ్యాపారాభివృద్ధికి భారీ శుభవార్త..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం క్లారిటీ.. తక్కువ వచ్చిందా.. అసలు రాలేదా.. ఇలా చేయండి..!

  3. Phone : మార్కెట్లోకి మడతలు పెట్టే (Tri Folded) ఫోన్.. 2 in 1 వినియోగం..!

  4. Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!

  5. BIG BREAKING : ఇరు వర్గాల ఘర్షణ టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్తు..!

మరిన్ని వార్తలు