Breaking Newsప్రపంచం

Srilanka : శ్రీలంకలో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!

Srilanka : శ్రీలంకలో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!

మన సాక్షి :

శ్రీలంకలో వరదలు బీభత్సంగా వస్తున్నాయి. ఆ దేశంలోని పలు ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 56 మంది మృతి చెందినట్లు కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాలలో నదులపై వంతెనలు, ఇండ్లు కొట్టుకుపోయాయి.

సుమారుగా 600 ఇండ్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నది. శ్రీలంక రాజధాని కొలంబోకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడి సుమారు 25 మందికి పైగా మరణించారు. మరో 21 మంది గల్లంతయ్యారు. 14 మందికి గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

  2. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!

  3. High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!

  4. Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు