హైదరాబాద్ నగరంలో కుండపోత.. జలమయమైన రోడ్లు, కాలనీలు..!
హైదరాబాద్ నగరంలో కుండపోత.. జలమయమైన రోడ్లు, కాలనీలు..!
మన సాక్షి , హైదరాబాద్ :
హైదరాబాద్ నగరం జలమయమైంది. రోడ్లు కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం భారీగా కురుస్తుంది.
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిమ్మ చీకట్లు కొమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలవాసులు బయటకు రావద్దని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు.
గత వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోయారు. అడపాదడపా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ALSO READ :
మిర్యాలగూడలో కుండపోత.. ఉరుములు, మెరుపులు చిమ్మ చీకట్లు..!
Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!
PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!









