Miryalaguda : గ్రామ సభలకు దరఖాస్తుల వెల్లువ..!
Miryalaguda : గ్రామ సభలకు దరఖాస్తుల వెల్లువ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే నాలుగు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో కులగణన ఆధారంగా ప్రభుత్వ అధికారులు సర్వే చేపట్టారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని గ్రామాలు, వార్డులలో సర్వేలు చేపట్టారు. కాగా సర్వేలో అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. 21వ తేదీ నుంచి 24వ తేదీన వరకు జాబితాలను ప్రదర్శించాల్సి ఉంది. కాగా అర్హుల జాబితాలో అనేక మందికి పేర్లు కనిపించకపోవడంతో మరోసారి దరఖాస్తులు చేసేందుకు సిద్ధమయ్యారు.
మంగళవారం ప్రారంభమైన గ్రామసభలలో దరఖాస్తులు చేసుకునేందుకు పేదలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం కూడా రేషన్ కార్డులకు మరోసారి గ్రామ సభలలో దరఖాస్తులు చేసుకోవచ్చని గైడ్లైన్స్ విడుదల చేసింది. దాంతో గ్రామసభలన్నీ కిటకిటలాడుతున్నాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల కోసం లబ్ధిదారులు దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరఖాస్తులు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
MOST READ :
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
TG News : తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!










