తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

Ponguleti : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆ కార్డు తప్పనిసరి.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

Ponguleti : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆ కార్డు తప్పనిసరి.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

ఇందిరమ్మ ప్రజా పాలనతోనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి సాధ్యమవు తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కడ్తాల కేంద్రంలో రూ.118 కోట్లతో నిర్మించిన నూతన తాహసిల్దార్ కార్యాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఎక్సైజ్ పరిధిలోని మండలాల గీతా కార్మికులకు మంజూరు చేసిన కాటమయ్య కిట్లను లబ్ధి దారులకు అందజేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో తహసిల్దార్ ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ చేసి సొంత భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమంతా అప్పుల పాలు చేశారని మార్పు కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్య ప్రజా పాలనను కోరుకున్నారని గుర్తు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత తమ పార్టీదే అన్నారు.ప్రతి నియోజక వర్గానికి 3500 తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తా మన్నారు.

ఫ్యామిలీ డిజిటల్ స్మార్ట్ కార్డు ద్వారా రేషన్ కార్డు హెల్త్ కార్డు, వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు స్మార్ట్ కార్డు ఎంతో ఉపయోగ పడుతుందని మంత్రి చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి స్మార్ట్ కార్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి బీద వారందరికీ స్మార్ట్ కార్డ్ అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

కడ్తాల్ కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆర్డిఓ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసి భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు చల్ల నరహా రెడ్డి, టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్,డిసిసి ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,గూడూరు భాస్కర్ రెడ్డి, యాట నరసింహ, బాలాజీ సింగ్, జక్కు అనంత రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి,బట్టు కిషన్ రెడ్డి, హనుమా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బిచ్య నాయక్ తెల్గమల్ల జగన్,కృష్ణ నాయక్, ఫరీద్,లు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు