Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల స్పష్టం..!

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల స్పష్టం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది మాసాలు గడిచింది. రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలలో రైతు భరోసా పథకం కూడా ఉంది. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి 10వేల రూపాయల పెట్టుబడి సహాయం రెండు విడతలుగా అందజేసింది.

కాగా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు తరహాలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

కానీ 10 నెలలు గడిచినప్పటికీ ఈ పథకాన్ని ప్రారంభించలేదు. గత యాసంగి సీజన్ లో కూడా రైతు బంధు పథకం ద్వారానే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. కానీ వానాకాలం సీజన్ లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.

ఇప్పటివరకు రైతు భరోసా పథకం ప్రారంభించలేదు. వానాకాలం సీజన్ కూడా మరికొద్ది రోజులలో ముగియనున్నది. వరి పంటలు కోతకు వచ్చాయి. అయినా కూడా రైతు భరోసా పథకం ప్రారంభించలేదు.

రైతు భరోసా పథకం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గాంధీభవన్ లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభించి రైతుల ఖాతాలలో పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. కాగా జూలై మాసంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. అయినా కూడా ఇంకా రుణమాఫీ ప్రక్రియనే కొనసాగుతుంది.

ఇప్పటివరకు రైతు ఖాతాలో 18 వేల కోట్ల రూపాయలను జమ చేశారు. ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎంతోమంది మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. 2 లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న రైతులు మాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతు భరోసా పథకం కూడా రుణమాఫీ పూర్తయ్యాక ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

దాంతో వానాకాలం సీజన్ లో రైతు భరోసా పథకం లేనట్లే అని చెప్పవచ్చును. ఇది ఇలా ఉండగా యాసంగి సీజన్ ప్రారంభం నాటికైనా రైతు భరోసా ఇస్తారా..? లేదా..? అనేది రైతులలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు