Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
గతంలో ఉన్న మిర్యాలగూడ ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య డిమాండ్ చేశారు.
యాదాద్రి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ భూ నిర్వాసితుల పేరుతో చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేశారని, కార్యాలయంలో పనిచేసే సెక్షన్ అధికారిగా హస్తం ఉందని, పూర్తి విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ కు వినతి పత్రం అందజేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలంలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు. కాగా భూ నిర్వాసితుల పేరుతో ఐడిబిఐ బ్యాంకు లో మూడు చెక్కులు ఆర్డిఓ సంతకం ఫోర్జరీ చేసి లక్షలాది రూపాయలు డ్రా చేసినట్లు తెలిసింది.
లింగస్వామి పేరిట రెండు, కోటయ్య పేరిట ఒక చెక్కు డ్రా చేసినట్లు తెలిసింది. కాగా మరో చెక్కు డ్రా చేసే సమయంలో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిసింది. ఈ విషయంపై అధికారులు పోలీస్ కేసు కూడా నమోదు చేశారని సమాచారం. కాగా వారిపై ఎలాంటి చర్య లు తీసుకోలేదని తెలుస్తుంది.
వారి నుంచి డ్రా చేసిన డబ్బులు రికవరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వినతిపత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు పోతుగంటి కాశి, నాయకులు వస్కుల సైదమ్మ, మోహన్ నాయక్, జ్యోతి, చంద్రకళ తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి పంట..!
-
MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)
-
Viral Video : ఆకలేస్తే పాములు వాటిని మింగుతాయి.. ఆ నాగుపాము మింగిన వాటిని ఏం చేస్తుంది.. (వీడియో)
-
Viral Video : బిఏ విద్యార్థి హిస్టరీ ఆన్సర్ షీట్.. ఆ చప్పుడుతో పేపర్ నింపేశాడు.. ఏంటబ్బా (వీడియో)









