Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

KITCHEN : బిల్లు రాలేదని వంట గదికి తాళం వేసిన మాజీ సర్పంచ్‌..!

KITCHEN : బిల్లు రాలేదని వంట గదికి తాళం వేసిన మాజీ సర్పంచ్‌..!

కంగ్టి, మన సాక్షి :

ప్రభుత్వ పాఠశాలలో వంటగదికి బిల్లు రాలేదని మాజీ సర్పంచ్‌ తాళం వేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

2022 సంవత్సరంలో వంటగది నిర్మించిన తాను కట్టించిన వంటగదికి బిల్లు రాలేదని మాజీ సర్పంచ్‌ చంద్రవ్వ తాళం వేసుకొని పోయారు. దీంతో వంట పాఠశాల బయట ఆవరణలో వంట చేస్తున్నారు. ఈ విషయం దేగుల్వాడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణి తెలిపారు.

దీంతో వంట చేయడానికి ఇబ్బందిగా ఉందని బయట ఆవరణలో వంట చేస్తున్నామని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వంటగదికి తాళం తీయించాలని కోరారు. దీనిపై మాజీ సర్పంచ్‌ చంద్రవ్వ స్పందించి.. నిర్మించిన బిల్లింగ్‌ బిల్స్‌ వచ్చే వరకు తాళం ఇవ్వమని చెప్పారు,

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు