క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

మన సాక్షి, హుజూర్ నగర్ :

చెడు వ్యసనాలకు అలవాటు అయిన నలుగురు యువకులు ఎస్సైలుగా అవతారం ఎత్తారు. ఈజీగా డబ్బులు సంపాదించుకోవాలని ఉద్దేశంతో గత సంవత్సరం నుండి బంగారం షాపులే టార్గెట్ గా పెట్టుకున్నారు. బంగారం షాప్ యజమానులకు ఎస్సైలం అంటూ ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

అలాంటి నలుగురి ఫేక్ ఎస్ఐలను సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హుజూర్ నగర్ సిఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం..

నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతలచెరువు ప్రశాంత్, చింతలచెరువు అక్షిత్ కుమార్, నల్లగొండ పట్టణం మాన్యం చల్క కు చెందిన షేక్ ఇర్ఫాన్, హైమద్ నగర్ కు చెందిన షేక్ వాజిద్. ఈ నలుగురు చెడు అలవాట్లకు బానిసలు అయ్యారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడి. గూగుల్ లో ఎస్ఐల ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని ట్రూ కాలర్ లో డీపీలుగా పెట్టుకున్నారు.

గూగుల్ మ్యాప్ లో బంగారం షాపుల వివరాలు యజమానుల వివరాలను సేకరించి పలానా పోలీస్ స్టేషన్ నుండి ఎస్సైని మాట్లాడుతున్నానని బెదిరించేవారు. బంగారం షాపులో మీరు దొంగ బంగారం కొన్నారని రికవరీ చేయాలంటూ.. లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించేవారు.

అలా వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మార్చి 1వ తేదీన చింతలచెరువు ప్రశాంత్ తిరుమలగిరి గ్రామానికి చెందిన శివకుమార్ అనే జ్యువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి తాను రాజంపేట ఎస్సై మాట్లాడుతున్నానని బెదిరించాడు. దొంగ బంగారం కొన్నావంటూ అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించడంతో లక్ష రూపాయలు ఫోన్ పే చేయమని కోరగా 52 వేల రూపాయలను పంపించాడు.

అదేవిధంగా 8వ తేదీన హుజూర్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనిధి జువెలరీ షాప్ యజమాని నవీన్ కుమార్ కు ఫోన్ చేసి కుప్పం ఎస్ఐ ని మాట్లాడుతున్నానంటూ బెదిరించాడు. దొంగ బంగారం కొనుగోలు చేసినందున రికవరీ చేయాలని లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించడంతో అతడు పదివేల రూపాయలను పంపించాడు. అయితే వారిపై అనుమానం ఉందని షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య దర్యాప్తు చేపట్టగా గోపాలపురం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు నేరస్తులు మోటార్ సైకిల్ పై కోదాడ వైపు వెళ్తుండగా పట్టుకుని విచారించారు. ఈ విచారణలో వారు నకిలీ ఎస్సైలుగా తేలిందని సిఐ తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రెండు సైకిల్ మోటార్లు, 24,900 రూపాయలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచారు.

MOST READ :

  1. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  2. AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!

  3. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  4. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  5. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  6. TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!

మరిన్ని వార్తలు