TGSRTC : ఉచిత బస్సు ప్రయాణం సరే.. ఏవీ పల్లె వెలుగులు.!
TGSRTC : ఉచిత బస్సు ప్రయాణం సరే.. ఏవీ పల్లె వెలుగులు.!
పెన్ పహాడ్, మన సాక్షి :
కరోనా కష్టకాలంలో మారుమూల గ్రామాలకు బస్సులు బంద్ పెట్టినారు. మళ్లీ పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించండి గ్రామాలకు రోడ్డు బాగున్న సింగిల్ బస్సు కూడా రావట్లేదని పెన్ పహాడ్ మండల పరిధిలోని వివిధ మారుమూల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గతములో సూర్యాపేట నుండి లింగాలకు ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం ఉండేది.
సూర్యాపేట నుండి మాచారం మీదుగా అనిరెడ్డిగూడెం, నూర్జాన్పేట, గూడెపుకుంట, గాజుల మల్కాపురం, చిదేళ్ల, తంగేళ్లగూడెం, చెట్ల ముకుందాపురం, వరకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బస్సు సౌకర్యము ఉండేది కరోనా కష్టకాలము లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు మారుమూల గ్రామాలకు వచ్చే బస్సు సౌకర్యాన్ని నిలిపి వేసినారు.
తిరిగి రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులను పునరుద్దించకపోవడం వలన మారుమూల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అవసరాల కొరకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఆఫీస్ కు, ఎమర్జెన్సీగా హాస్పటల్ కు వెళ్లే వారికి, విద్యను అభ్యసించడానికి విద్యార్థులు వెళ్లడానికి, పలు రకాల అవసరాల కొరకు సూర్యాపేట పట్టణానికి వెళ్లాలంటే వివిధ గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడవలసి వస్తున్నది గనుక మళ్లీ మారుమూల గ్రామాలకు ప్రభుత్వం వారు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నారు.
MOST READ :
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!
-
Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!
-
Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!









