Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునిర్మల జిల్లా

ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి..!

ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందిన విషాదకర ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా బంగల్ పేట వద్ద మహాలక్ష్మి వాడలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో సి బ్లాక్ లో ఈ ఘటన జరిగింది.

ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి చెందిన విషాదకర ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా బంగల్ పేట వద్ద మహాలక్ష్మి వాడలోని డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో సి బ్లాక్ లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలిన ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఇంట్లో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

దాంతో స్ధానికులు వారిని ఆంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ మహిళతో పాటు ఇంటి యజమాని విజయ్ ప్రాణాలు కోల్పోయారు. మరణించిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు