స్నేహితులే శత్రువులుగా.. వెంటాడి, వేటాడి కొట్టి చంపారు.. కారణం..!
స్నేహితులే శత్రువులుగా.. వెంటాడి, వేటాడి కొట్టి చంపారు.. కారణం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఇటీవల కాలంలో స్నేహితులే శత్రువులుగా మారుతున్నారు. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడి ప్రాణాల దాకా వెళ్తున్నాయి. స్వార్థం పెరిగిపోయింది. స్నేహితుల మధ్య స్వార్థం కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో..? ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి.
ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణమైన సంఘటన జరిగింది. స్నేహితులు చేసే ర్యాగింగ్ వల్ల ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు.
పుట్టపర్తి లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రేమ్ సాయి అనే యువకుడు బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కాగా అదే కళాశాల విద్యార్థులు ప్రేమ్ సాయిని ర్యాగింగ్ చేశారు. దాంతో ప్రేమ్ సాయి తీవ్ర మనస్థాపానికి గురై ర్యాగింగ్ విషయాన్ని కాలేజీ యాజమాన్యం కు ఫిర్యాదు చేశాడు.
దాంతో యాజమాన్యం కు ఫిర్యాదు చేయడం వల్ల ర్యాగింగ్ చేసిన విద్యార్థులు ప్రేమ్ సాయి పై కక్ష పెంచుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూశారు.. ప్రేమ్ సాయిని కళాశాల గ్రౌండ్ లోనే దారుణంగా కొట్టారు. దెబ్బలు తిన్న విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ప్రేమ్ సాయిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
అప్పటికే ప్రేమ్ సాయి చెవి లోపల భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని డాక్టర్స్ చెప్పారు. కాగా మనస్థాపానికి గురై ప్రేమ్ సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడిని కొట్టడం వల్లనే చనిపోయాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
MOST READ :









