పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!
పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!
డాకూర్ జాతీయ రహదారిపై కారు బోల్తా
– 5 గురికి గాయాలు
ఆంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు
– సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎంపీ బీబీ పాటిల్
అందోలు, మన సాక్షి:
రెండు నిమిషాల ముందు తల్లి ఒడిలో ఆడుకున్న బిడ్డ మరో నిమిషంలోనే తల్లిదండ్రుల ముందు విగత జీవిగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం డాకూరు, ఎర్రారం గ్రామ నాందేడ్, అకోలా జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి నాందేడ్‌లో ఫంక్షన్‌కు హజరయ్యేందుకు కారులో వెళుతుండగా కారు ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న విరాట్ (9 నెలలు) బాలుడు అక్కడికక్కడే మృతి చెందడంతో సంతోషంగా ప్రయాణిస్తున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
ALSO READ : మిర్యాలగూడ : రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానం..!
కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మహిళలకు, ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమచారం ఇవ్వడంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్సలు చేశారు.
అదే రోడ్డు గుండా వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తన వాహానాన్ని నిలుపుకొని క్షతగాత్రులకు సహయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్ వాహనంలోనే వారందరిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
చనిపోయిన బిడ్డను ఎత్తుకొన్న తల్లి హృదయవేదన :
బోల్తా కొట్టిన కారులో గాయపడ్డ తల్లి తన దెబ్బలను లెక్క చేయకుండా తన కొడుకుకు ఏం జరిగిందోనన్న ఆత్రుతతో అటు ఇటు వెతకగా, తీవ్ర గాయాలతో రక్తస్త్రావంలో ఉన్న తన బిడ్డను కారులో నుంచి బయటకు తీసి ఒడిలో పండుకోబెట్టుకొని రోడ్డుపైన కూర్చొని విరాట్…విరాట్ అంటూ ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో ఆమె హృదయ వేదనకు అంతులేకుండా పోయింది.
ALSO READ : ఇద్దరూ స్నేహితులే.. రైలు పట్టాల పైకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది..!
అటువైపుగా వెళ్లిన వాహనదారులు ఈ హృదయ విదారకరమైన దృశ్యాన్ని చూసి కంట తడిపెట్టకుండా ఉండలేకపోయారు.
ఆమె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. జాతీయ రహదారిపై జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైనా పోలీసుల దృష్టికి మాత్రం రాకపోవడం, కేసులు నమోదు కాకపోవడం, ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని చెప్పడం విశేషం.










