మిర్యాలగూడ : రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానం..!

క్షణికావేశం , చిన్న చిన్న కారణాలకు, మనస్పర్ధలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది .పరీక్షలో తప్పామని, తల్లిదండ్రులు తిట్టారని, చిన్న చిన్న వస్తువులు కొనియలేదని ,ఇంకా అతి చిన్న కారణాలవల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మిర్యాలగూడ : రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానం..

మిర్యాలగూడ , మన సాక్షి :

క్షణికావేశం , చిన్న చిన్న కారణాలకు, మనస్పర్ధలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది .పరీక్షలో తప్పామని, తల్లిదండ్రులు తిట్టారని, చిన్న చిన్న వస్తువులు కొనియలేదని ,ఇంకా అతి చిన్న కారణాలవల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

యువతి , యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం…
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైల్వే స్టేషన్ కు సమీపంలో రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన యువతి యువకుడిని ప్రేమ జంటగా భావిస్తున్నారు.

ALSO READ : Gas : వంటగ్యాస్ రూ. 500 లకే రావాలంటే.. కేవైసీ చేయించాలా..!

సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా యువతి చేతి పై రామలక్ష్మ అనే పచ్చబొట్టు ఉంది. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతుల వద్ద ఉన్న సెల్ ఫోన్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ సిమ్ కార్డు లేకపోవడంతో ఎలాంటి సమాచారం లభించలేదు. కాగా మృతులు ఇద్దరు ఎక్కడి వారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా వారిరువురూ.. ప్రేమికులా లేక భార్యాభర్తల అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

ALSO READ : ఇద్దరూ స్నేహితులే.. రైలు పట్టాల పైకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది..!