Gas : వంటగ్యాస్ రూ. 500 లకే రావాలంటే.. కేవైసీ చేయించాలా..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. హామీల అమలులో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేయడానికి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది.

Gas : వంటగ్యాస్ రూ. 500 లకే రావాలంటే.. కేవైసీ చేయించాలా..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. హామీల అమలులో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేయడానికి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈనెల 28వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 6వ తేదీన ముగియనున్నది.

ప్రభుత్వ పథకాలలో ఎక్కువగా మహిళలకే పెద్ద పీట వేశారు. మహిళలు అర్హులుగా ఉన్నట్లయితే లబ్ది చేకూరుతుందని కూడా అనేకమంది భావిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు వినియోగించే వంటగ్యాస్ 500 రూపాయలకే ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో గ్యారెంటీ హామీలలో దానికోసం కూడా దరఖాస్తు స్వీకరిస్తున్నారు. కాగా తమకు ఉన్న వంటగ్యాస్ కేవైసీ చేయించారా..? లేదా.? అనే విషయం అందరిలో సందిగ్ధంలో ఉన్నది. ప్రజా పాలన దరఖాస్తులో గ్యాస్ కంపెనీ, ఏజెన్సీ, సిలిండర్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంది. కాగా ప్రజలంతా ఓపక్క గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులకు.. మరోపక్క వంట గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ కేవైసీ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.

ALSO READ: మిర్యాలగూడ : 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తులు.. గ్రామాల వారీగా సమావేశాలు ఎప్పుడంటే ..!

కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ గుంపులు. గుంపులుగా వంట గ్యాస్ వినియోగదారులు తరలి వెళ్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు కేవైసీ గురించి చెప్పడం నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలోనే వంటగ్యాస్ వినియోగదారులందరికీ కూడా కేవైసీ చేసినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. అదే విధంగా కేవైసీ పూర్తి చేసిన వాళ్లకే ప్రభుత్వం నుంచి సబ్సిడీ డబ్బులు కూడా గతంలో అకౌంట్లో వేసిన విషయం తెలిసిందే.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ వైస్ చైర్మన్ అకాల మృతి.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతాపం..!

వంట గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కరికి కేవైసీ ఉండాల్సిందే. అదేవిధంగా కొనుగోలు చేసిన వారందరికీ కూడా ఏజెన్సీలు గతంలోనే కేవైసీ పూర్తి చేశారు. కేవలం దీపం పథకం కింద కొనుగోలు చేసిన వారికి, ఉజ్వల వంట గ్యాస్ పథకం కింద తీసుకున్న లబ్ధిదారులకు మాత్రం కేవైసీ చేపట్టలేదు. అందుకు దీపం , ఉజ్వల పథకాల ద్వారా తీసుకున్న వంట గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేపిస్తే సరిపోతుందని నిర్వహకులు పేర్కొంటున్నారు.

ALSO READ : పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే స్ఫూర్తి కనబరచి కాంగ్రెస్ ను గెలిపించాలి.. జానారెడ్డి