పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే స్ఫూర్తి కనబరచి కాంగ్రెస్ ను గెలిపించాలి.. జానారెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే స్ఫూర్తిని కనబరిచి ఎంపి స్థానాలను గెలిపించాలని సిఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే స్ఫూర్తి కనబరిచి కాంగ్రెస్ ను గెలిపించాలి

సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానా రెడ్డి

మిర్యాలగూడ  , మన సాక్షి :

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే స్ఫూర్తిని కనబరిచి ఎంపి స్థానాలను గెలిపించాలని సిఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించారని అన్నారు. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తిని కనబరిచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించాలని ఆయన కోరారు.

ALSO READ : మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!

సమావేశంలో డిసిసి అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్ , పిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య , పగిడి రామలింగయ్య యాదవ్ , రాష్ట్ర నాయకులు దీరవత్ స్కైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, దామరచర్ల మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , తలకొప్పుల సైదులు , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సలీం, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్,

ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు ఇంజమూరి లలిత , దామరచర్ల మిర్యాలగూడ మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ కాకునురి బసవయ్య గౌడ్ సీనియర్ నాయకులు దైద సంజీవరెడ్డి, ఆవుల బక్క రెడ్డి, నారాయణ, కందుల నరసింహారెడ్డి , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AĹSO READ : జానారెడ్డిని సన్మానించిన రైస్ మిల్లర్స్..!