మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!

మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ను మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మంగళవారం పరామర్శించారు.

మిర్యాలగూడ : ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను పరామర్శించిన జానారెడ్డి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ను మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మంగళవారం పరామర్శించారు. మిర్యాలగూడ పట్టణంలోని ఆయన నివాసంలో బిఎల్ఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను జానారెడ్డి పరామర్శించారు.

గత కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాతృమూర్తి బత్తుల వెంకట్రావమ్మ స్వర్గస్తులైన విషయం తెలిసిందే.

కాగావారి స్వగృహానికి వచ్చి వారి కుటుంబభ్యులను పరామర్శించారు. వెంకట్రావమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి బాలు, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, గాయం ఉపేందర్ రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, తమ్మడ బోయిన అర్జున్, మొలాల అమృత రెడ్డి, బల్గూరి శ్రీనివాస్,  బంటు లక్ష్మీనారాయణ, సలీం తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : శ్రీనివాస్ నగర్ లో చోరీ..!