మిర్యాలగూడ : మున్సిపల్ వైస్ చైర్మన్ అకాల మృతి.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతాపం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు (కోటేశ్వరరావు) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో అకాల మృతి చెందారు. సంఘటన తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మిర్యాలగూడ : మున్సిపల్ వైస్ చైర్మన్ అకాల మృతి.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతాపం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు (కోటేశ్వరరావు) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో అకాల మృతి చెందారు. సంఘటన తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాత్రి 8 గంటల వరకు కాలనీవాసులతో కలిసిమెలిసి ఉన్న కుర్ర విష్ణు స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంతాపం తెలియజేసిన వారిలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, వివిధ పార్టీల నాయకులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , గాయం ఉపేందర్ రెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి, జానీ, రామకృష్ణ, తమ్ముడు బోయిన అర్జున్, పొదిల శ్రీనివాస్, శాగ జలంధర్ రెడ్డి, పాతూరి ప్రసాద్, బల్గూరి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

రైస్ మిల్లర్స్ సంతాపం : 

మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అకాల మృతి చెందడంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. సంతాపం తెలియజేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ,  మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, నాయకులు బండారు కుశలయ్య, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మండలి చైర్మన్ నివాళులు : 

మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అకాల మృతికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నివాళులర్పించారు. బుధవారం ఆయన నివాసంలో కుర్ర విష్ణు పార్థివ దేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నూకల హనుమంత రెడ్డి , నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్ , పాలుట్ల బాబయ్య తదితరులు ఉన్నారు.

ALSO READ : పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే స్ఫూర్తి కనబరచి కాంగ్రెస్ ను గెలిపించాలి.. జానారెడ్డి