ఇద్దరూ స్నేహితులే.. రైలు పట్టాల పైకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది..!

వారిద్దరూ స్నేహితులే.. మద్యం మత్తులో తరచూ తగాదాలు పడుతుంటారు. వారిద్దరూ కలిసి మరోసారి తగాదాపడ్డారు. ఇద్దరు కలిసి రైలు పట్టాలపై ఎందుకు వెళ్లారు..? వారిని రైలు ఎలా ఢీ కొట్టింది అనేదానికి పదార్థమే కారణం అయ్యుండొచ్చునా..?

ఇద్దరూ స్నేహితులే.. రైలు పట్టాల పైకి ఎందుకు వెళ్లారు, ఏం జరిగింది..!

హైదరాబాద్, మన సాక్షి :

వారిద్దరూ స్నేహితులే.. మద్యం మత్తులో తరచూ తగాదాలు పడుతుంటారు. వారిద్దరూ కలిసి మరోసారి తగాదాపడ్డారు. ఇద్దరు కలిసి రైలు పట్టాలపై ఎందుకు వెళ్లారు..? వారిని రైలు ఎలా ఢీ కొట్టింది అనేదానికి పదార్థమే కారణం అయ్యుండొచ్చునా..?

రోజు రోజుకు చెడు అలవాట్లకు విద్యార్థులు యువత ఆకర్షితులవుతున్నారు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ అలవాట్లకు యువత బానిసలవుతున్నారు.

దేశం లో నేటి యువతే రేపటి భవిత అని చెప్పుకుంటున్న తరుణం లో ఇలాంటి చెడు అలవాట్ల వల్ల అదే యువత అనవసర మైన వాటికి బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది కాలేజీకి వెళ్లే విద్యార్థు లు, ఉద్యోగాలకు వెళ్లే యువత ఎక్కువ గా ఉండటం విచారకరం.

ALSO READ : Gas : వంటగ్యాస్ రూ. 500 లకే రావాలంటే.. కేవైసీ చేయించాలా..!

ఈనేపథ్యంలోనే చెడు అలవాట్ల బారిన పడిన స్నేహితులు ఇద్దరు మద్యపానంతో పాటు గంజాయి పీల్చడం వంటి అలవాట్లకు బానిసలై తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారo సాయంత్రం వారి మధ్య ఆనవాయితీగా వివా దం ఆరంభమైంది. దీంతో సదరు ఇద్దరు స్నేహితులు గొడవ పడు తూ.. పడుతూ.. రైలు పట్టాలపైకి చేరుకొని ఎక్కడ స్థలం దొరకనట్లు రైలు పట్టాల పనే ఘర్షణ పడ్డారు.

మద్యం మత్తులో ఇరువురు పర స్పరం ఏమాత్రం తగ్గకుండా ఆదమర్చి ఘర్షణ పడుతున్న క్రమంలో అటువైపుగా రైలు దూసుకొచ్చిన రైలు ఢికొని వారిద్దరూ అక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఎవరు ఊహించని విధంగా వీరి నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది.

ALSO READ : మిర్యాలగూడ : 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తులు.. గ్రామాల వారీగా సమావేశాలు ఎప్పుడంటే ..!

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడు తున్న సమయంలో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తు లు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ వైస్ చైర్మన్ అకాల మృతి.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతాపం..!