సూర్యాపేట : గణేష్ నిమజ్జనంలో అపశృతి, ఒకరు మృతి

సూర్యాపేట : గణేష్ నిమజ్జనంలో అపశృతి, ఒకరు మృతి

సూర్యాపేట, సెప్టెంబర్11, మనసాక్షి ; సూర్యాపేట జుల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని శెట్టిగూడ గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మండలంలోని కోటి నాయక్ తండాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కాలువలో పడి శుక్రవారం ఇద్దరు మృతి చెందిన సంఘటన మరువక ముందే శెట్టి గూడెంలో నిమజ్జన సందర్భంగా చెరువులో పడి మరో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్లూరు రాములు (40) గణేష్ విగ్రహం నిమజ్జనం చేస్తుండగా చెరువులో పడి మృతి చెందాడు.

గ్రామంలోని కానాల బిక్షంరెడ్డి ఇంటిముందు ఉన్న గణేష్ విగ్రహం కు శనివారం రాత్రి శోభాయాత్ర నిర్వహించి అనంతరం నిమజ్జనంకోసం స్థానిక చెరువులోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో గణేష్ కమిటీ సభ్యులతోపాటు మృతుడు రాములు చెరువులోకి దిగి ఉండవచ్చునని అనుకున్నారు రాత్రి పదిన్నర కావడంతో చీకట్లో కాలుజారి చెరువులో పడిపోయి ఉండవచ్చు నని తెలిపారు.నిమజ్జనకు వచ్చిన వారు ఇంటికి వచ్చి చూస్తే మృతుడు రాములు కనిపించలేదు. అక్కడ ఇక్కడ వెతికి చివరకు చెరువులో వెతకడం ప్రారంభించారు.

ఆదివారం ఉదయం రాములు చెరువులో శవమైతెలాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవంను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుడు రాములు భార్య పుల్లూరు మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదవేందర్రెడ్డి తెలిపారు. రాములు మృతికి కమిటీ సభ్యులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారని తెలిపారు. మృతుడు రాములు కు భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు.