Childrens Death Case : గెట్ టు గెదర్ ఎంత పని చేసింది.. పెరుగన్నం తినకుండా బతికిపోయిన చంద్రయ్య..!
Childrens Death Case : గెట్ టు గెదర్ ఎంత పని చేసింది.. పెరుగన్నం తినకుండా బతికిపోయిన చంద్రయ్య..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
చాలా కాలం తర్వాత స్నేహితులు కలిసి ఏర్పాటు చేసుకునేది గెట్ టు గెదర్ పార్టీ. పాత జ్ఞాపకాలతో స్నేహితులు సంతోషంగా గడుపుతారు. కానీ ఆ పార్టీ వారి జీవితంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు చిన్నారులు రాత్రికి రాత్రే మృతి చెందిన కేసు మిస్టరీ వీడింది. దానికి వివాహేతర సంబంధమే కారణంగా ముగ్గురి చిన్నారులను కూడా కన్నతల్లి కడతేర్చినట్లుగా నిర్ధారణ అయింది. మొదటగా పోలీసులు భర్త చెన్నయ్య పై అనుమానం వచ్చి విచారణ జరిపిన అనంతరం భార్య ముద్దాయిగా తేల్చారు.
రంగారెడ్డి జిల్లా మెడకపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య తన భార్యా పిల్లలతో సంగారెడ్డి జిల్లా రాఘవేంద్ర కాలనీలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మార్చి 27వ తేదీన 9 గంటలకు కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. తాను పప్పన్నంతో తిని డ్యూటీకి వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున భార్య రజిత కు కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె చికిత్స పొందుతుండగా ఇంటికి వచ్చిన చంద్రయ్యకు ముగ్గురు పిల్లలు కూడా నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన కలకలం రేపింది.
ముగ్గురు పిల్లల కూడా పెరుగన్నంలో విషం కలిపి పెట్టి ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసిందని తొలిత భావించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నయ్య పై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేశారు. విచారణలో ఆయన పాత్ర లేదని తేలింది. ఆ తర్వాత చికిత్స పొందుతున్న భార్య రజితను విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రజిత పదవ తరగతి క్లాస్మేట్స్ ఈమధ్య ఇటీవల గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత పాఠశాల చదివేటప్పుడు చనువుగా ఉండే ఓ వ్యక్తితో మళ్లీ స్నేహం కుదిరింది. అలాగ తన పాత క్లాస్మేట్ తో రజిత చాటింగ్ చేయడం.. ఫోన్లు మాట్లాడటం చేసింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.
భర్త పిల్లలను ఎలాగైనా అడ్డు తొలగించుకుంటే ప్రియుడుతో హాయిగా జీవించవచ్చునని రజిత భావించి మార్చి 27వ తేదీన రాత్రి భోజనంలో భర్తకు పిల్లలకు విషం పెట్టాలనుకుంది. అయితే భర్త కేవలం పప్పన్నం మాత్రమే తినడం వల్ల బతికాడు. పిల్లలు పెరుగన్నం తిని మృతి చెందారు. అలా ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12) మధుప్రియ (10) గౌతమ్ (8) నిద్రలోనే మృతి చెందారు. భర్త చెన్నయ్య కు అనుమానం రావద్దని తాను కూడా కడుపునొప్పి వస్తుందని నాటకమాడి ఆసుపత్రిలో ఆమె చేరింది.
MOST READ :









