Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!
Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!
ఆరుగురి ముఠాపై కేసు.. ఇద్దరి అరెస్ట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపూరిత మాటలు చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి తప్పుడు ఆర్డర్ కాపీలు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మోసం చేశారు. మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీస్తే వారిని చంపుతామని బెదిరించారు. ఈ సంఘటన మిర్యాలగూడ లో వెలుగులోకి వచ్చింది.
శనివారం మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణంతోపాటు చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ యువతను నీ సహాయతను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ముఠాలో ఆరుగురు ఉన్నారని వారిలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు డిఎస్పి తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిలో ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల పట్టణానికి చెందిన రాసపుత్ర రాఘవేందర్ అలియాస్ రాజు, మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్ కు చెందిన రాళ్లపల్లి శ్రీధర్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా పరారీలో కాసిం, హైదరాబాద్ కు చెందిన ఎడ్ల చంద్రయ్య, మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాళ్లపల్లి నారాయణ, రాళ్లపల్లి పార్వతమ్మ ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి రెండు స్మార్ట్ ఫోన్లు 1,50,000 రూపాయలు, కొంతమంది రెస్యూమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
9 మంది బాధితుల వద్ద 45 లక్షల పదివేల రూపాయలను వసూలు చేసి వారికి హోంగార్డు, ఏఎన్ఎం, రైతుల రుణాల రికవరీ ఏజెంటు, కంప్యూటర్ ఆపరేటర్ జాబు ఇప్పిస్తానని వారిని ఈ ముఠా మోసం చేసింది. వాళ్లకు జాబ్ లో జాయిన్ కావడానికి ఫేక్ ఆర్డర్ కాపీలను కూడా అందజేశారు.
లెటర్స్ ఇచ్చి జాబ్ ఇప్పించకుండా మోసం చేయడంతో వారు తిరిగి తమ డబ్బులు ఇవ్వాలని అడగడంతో చంపుతామని బెదిరింపులకు పాల్పడడంతో వేముల వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు వేముల వంశీ ఫిర్యాదు మేరకు సీఐ నాగార్జున, ఎస్ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!
-
TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!









