క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!

Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!

సూర్యాపేట, మనసాక్షి :

మేము కనక పోయినా పిల్ల పైన ఉన్న మమకారం తొ డబ్బులు వెచ్చించి కొనుకొన్న.. తమ పేగు బందంగా అనుకోని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మా పిల్లల్ని మాకు ఇప్పించండి మహా ప్రభో అంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు పెడుతున్న ఆర్తనాదాలు మిన్నంటాయి . వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శిశువుల విక్రయాలు జరుగుతున్నాయని పసిగట్టిన పోలీసులు బుధవారం 18 మంది శిశువులను సంరక్షణలోకి తీసుకున్నారు.

దీంతో తట్టుకోలేని వారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మా పిల్లల్ని మాకు ఇప్పించండి సార్ అంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ రోడ్డు మీద విలపిస్తూ ధర్నాకు దిగారు. పిల్లలు లేక తీసుకొచ్చుకున్నాము మా ఆస్తులన్నీ వారికే రాసిస్తాము మా పిల్లల్ని మాకు అప్పగించండి లేకుంటే ఆత్మహత్యలే మాకు శరణ్యం అంటూ పోలీసులను వేడుకున్నారు.

దాంతో కొద్దిసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేతపల్లి మండలం కొప్పులు గ్రామానికి చెందిన దంపతులు 25 రోజుల పసిపాపను నాలుగు లక్షలకు తెచ్చుకొని రెండు సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని మా పాప ను మాకు కావాలని రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

మరోవైపు.. సూర్యాపేట మండలం టేకు మట్ల గ్రామానికి చెందిన దంపతులు రెండు నెలల బాలుడిని తీసుకొని మూడు సంవత్సరాల బాబుగా పెంచుకుంటుంటే బుధవారం పోలీసులు ఇంటి వద్దకు వచ్చి తీసుకుపోవడంతో ఆ తల్లి విలపిస్తూ సొమ్మ సిల్లి రోడ్డు మీద పడిపోయింది. ఈ సంఘటన చూసి, పలువురు శిశువులను పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఏడుస్తూ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతుంది.. చూపరులను కంటతడి పెట్టించింది.

MOST READ : 

  1. District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!

  2. TG News : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు