Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుయాదాద్రి భువనగిరి జిల్లా

Maha Padi Pooja : వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ..!

Maha Padi Pooja : వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ..!

తుర్కపల్లి, మన సాక్షి :

తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి స్వగృహంలో ఆదివారం బ్రహ్మశ్రీ డాక్టర్ పి ఎం మనోజ్ తాంత్రిక ఆధ్వర్యంలో పెండెం శ్రీనివాస్ గురు స్వామి, రామారావు గురుస్వాముల పర్యవేక్షణలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఉదయం గణపతి హోమం, సమస్త దేవతా ప్రార్థన ,గణపతి పూజ, అష్టోత్తర శతనామావళి, దూపము, నైవేద్యము, కర్పూర హారతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పూజ, అష్టోత్తర శతనామావళి, దూపము, నైవేద్యము, కర్పూర హారతి, శ్రీ అయ్యప్ప స్వామిపూజ,

శ్రీ అయ్యప్ప స్వామి అధాంగ పూజ, అష్టోత్తర శతనామావళి, దూపము, దీపము, నైవేద్యము, హారతి, శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోష, అయ్యప్ప స్వామికి 18 రకాల కలశాలతో అభిషేకము, 18 రకాల పాలు, పెరుగు, నెయ్యి తో అభిషేకాలు. అనంతరం పుష్పాభిషేకం, స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి పడి పూజను నిర్వహించి పడిని వెలిగించారు.

అనంతరం మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షణ, భూతనాధ సోత్ర రత్నావళి, మంగళ హారతి, క్షమాపణ మంత్రాన్ని తో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి అందెశ్రీ, గురుస్వాములు పత్తిపాటి హనుమంతరావు, పత్తిపాటి ఆనంద్, రాయగిరి శ్రీనివాస్, రాచర్ల నాగరాజు, చాడ కరుణాకర్ రెడ్డి , దొమ్మాట భాస్కర్, పూడూరు శేఖర్, గురునాథ్, కనకరాజు, బో రెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి ,ధార నవీన్, రాజేష్, మున్సిపల్ రాజు, నరసింహ, బొల్లారం రవి, రాజు, రాజేష్, బాలు, సంతోష్, మంజు నాయక్, వివిధ మండలాల, గ్రామాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  2. VISA : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాక్.. యూఎస్ వీసా మరింత కఠినం..!

  3. ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

  4. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

  5. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరిగితే వారిపై చర్యలు..!

మరిన్ని వార్తలు