Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!
Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ధరలు పెరిగిపోయాయి. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో ప్రభావంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల కారణంగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చును. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా జాతీయ మార్కెట్ కనుగుణంగా బంగారం ధర పెరిగింది. సోమవారం ఒక్కరోజే 3900 రూపాయలు పెరిగింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం శని ఆదివారాల్లో 8,66,700 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 3900 రూపాయలు పెరిగి 870,600 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం శని ఆదివారాల్లో 7,94,500 రూపాయలు ఉండగా సోమవారం ఒక్కరోజే 3,500 పెరిగి 7,98,000 కు పెరిగింది.
అదేవిధంగా 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం సోమవారం 87,060 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 79,800 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.









