Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. లక్షకు చేరువగా..!
పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గాయి.

Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. లక్షకు చేరువగా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. గత పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గాయి. 10 రోజుల్లోనే సుమారుగా 10 గ్రాముల (తులం) బంగారం కు 19000 రూపాయలు తగ్గింది. సోమవారం ఒక్కరోజే 5950 తగ్గింది. దాంతో మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్ లో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు సోమవారం 59,500 తగ్గి 14 లక్షల 200 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 54,500 తగ్గి 12 లక్షల 83 వేల 500 రూపాయలకు చేరింది.
ఈరోజు తులం ఎంతంటే :
10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ కు సోమవారం 5950 రూపాయలు తగ్గి 1,40,020 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 5450 తగ్గి 1,28,350 రూపాయలకు చేరింది.
తులం లక్షకు చేరేనా..
పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా గత పది రోజుల కాలంలో తులం కు సుమారుగా 19 వేల రూపాయలు తగ్గిన బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. లక్ష రూపాయలకు తులం బంగారం చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.









