TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర దిగి వచ్చింది. ఇటీవళ తులం బంగారం లక్ష రూపాయలకు పైగా అయిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ బంగారం ధరలు దిగి వచ్చాయి. బుధవారం ఒక్కరోజు 100 గ్రాముల బంగారం కు 5400 రూపాయలు తగ్గింది. దాంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 9,60,600 ఉండగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర 8,80,500 రూపాయలు ఉంది.

తులం బంగారం ధర ఎంతంటే..?

హైదరాబాదులో తులం బంగారం ధర ఎంత ఉందంటే..? బుధవారం మార్కెట్ ధర ప్రకారం 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 88,050 రూపాయలు ఉండగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 96,060 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

Latest News :

 

మరిన్ని వార్తలు