Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర కొండెక్కింది. రోజు రోజుకు ధర భారీగా పెరుగుతోంది. పొలం బంగారం లక్షన్నరకు చేరువైంది. దాంతో మహిళలు నిరాశతో ఉన్నారు.

Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర కొండెక్కింది. రోజు రోజుకు ధర భారీగా పెరుగుతోంది. పొలం బంగారం లక్షన్నరకు చేరువైంది. దాంతో మహిళలు నిరాశతో ఉన్నారు.
మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 21,300 రూపాయలు పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 19,500 పెరిగింది. భారీగా పెరుగుతున్న ధరలతో సాధారణ దుకాణాలలో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి.
ఈరోజు తులం ఎంతంటే :
మంగళవారం (10 గ్రాముల) తులం 24 క్యారెట్స్ బంగారం కు 2130 రూపాయలు పెరిగి ఒక లక్ష 48 వేల 370 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం ధర 1950 రూపాయలు పెరిగి ఒక లక్ష 36 వేల రూపాయలకు చేరింది.
ప్రధాన పట్టణాలలో :
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, తిరుపతి నగరాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!
-
BREAKING: స్లీపర్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు..!
-
Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
-
Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!