సినిమాBreaking Newsజాతీయం

Kumbh Mela Monalisa : కుంభమేళ మోనాలిసాకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం..!

Kumbh Mela Monalisa : కుంభమేళ మోనాలిసాకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం..!

మన సాక్షి, వెబ్ డేస్క్:

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా ఇప్పుడు సెలబ్రిటీగా మారింది. కుంభమేళాలో తేనె కళ్ళతో కనిపించిన ఆ యువతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆమె పేరు ట్రెండ్ గా మారింది. అదృష్టం ఆమెని వెతుక్కుంటూ వచ్చింది.
ఇప్పుడు మోనాలిసా ఇంటికి ఓ దర్శకుడు వెళ్లడంతో ఆమె వార్తల్లో నిలిచింది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని కార్గోన్ జిల్లా మహేశ్వర్ కు చెందిన మోనాలిసా మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది. అయితే ఆమె న్యాచురల్ గా బ్యూటీగా కనిపించడంతో కుంభమేళాలో హాజరైన వారంతా ఫిదా అయ్యారు. అక్కడ ఆమెతో ఎగబడి సెల్ఫీలు దిగడంతో ట్రాఫిక్ జామ్ లు సైతం అయ్యాయి. దాంతో ఆమెను పోలీసులు అక్కడి నుంచి పంపేసినట్లుగా తెలుస్తుంది.

అయితే నేమి అప్పటికే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు బాలీవుడ్ డైరెక్టర్ ని ఆకర్షించాయి. అయితే అతను మోనాలిసాకు సినిమా ఆఫర్లు ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. అంతేకాక ఆమెను వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ కు వెళ్లిన ఆ డైరెక్టర్ సలోజ్ మిశ్రా తల్లిదండ్రులను సైతం ఒప్పించారు.

ఆ డైరెక్టర్ ప్రస్తుతం చేయబోయే డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసాకు అవకాశం ఇచ్చారు. ఆమెకు యాక్టింగ్ రాకపోయినా నేర్పించి మరీ సినిమాలో ఆమెతో నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుండగా, దాంతో పాటు మరో నాలుగు సినిమాలలో ఆఫర్స్ వచ్చినట్లుగా సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు