Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : సక్రమంగా లేని ఉపాధి హామీ రికార్డులు.. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా..!

Miryalaguda : సక్రమంగా లేని ఉపాధి హామీ రికార్డులు.. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రికార్డులు పూర్తిస్థాయిలో నిర్వహించకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ఉన్నతాధికారులు జరిమానా విధించారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి అదనపు ప్రాజెక్టు అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరి శర్మ, ఏపీవో కళావతి, విజిలెన్స్ అధికారి వేణుగోపాలరావు రికార్డులను పరిశీలించారు.

రికార్డుల తనిఖీలో భాగంగా మస్టర్లలో కొట్టివేతలు, రికార్డులు సక్రమంగా లేకపోవడం, పనులకు వర్క్ సైట్ బోర్డులు పెట్టనందున, కొన్ని మాస్టర్లలో కొట్టివేతలు ఉన్నందున జరిమానాలు విధించారు. పంచాయతీ కార్యదర్శులకు 22, 721 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు 12,768 రూపాయలు, టెక్నికల్ అసిస్టెంట్లకు 14,568 రూపాయలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు 5980 రూపాయలను జరిమానంగా విధించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పాటించాలన్నారు. కూలీలకు అందరికీ పనులు కల్పించి అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేలా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఏవో గౌతమి, ఏపీ డి బాలకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్ చారి, ఎస్ఆర్పి సాంబశివ చారి తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Additional Collector : స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

  2. దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!

  3. Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!

  4. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!

  5. Inter Exams : ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు.. పకడ్బందీగా నిర్వహించాలి..!

మరిన్ని వార్తలు