Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవిద్యహైదరాబాద్

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

మన సాక్షి , ఎడ్యుకేషన్ :

తెలంగాణలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉచిత శిక్షణ అందజేయడానికి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రతి సంవత్సరం వందలాది మంది అభ్యర్థులు ఉచిత శిక్షణ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ అవకాశాన్ని డిగ్రీ చదివిన వారు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం పేర్కొన్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో, కస్తూరిబా గాంధీ పాఠశాలలో, మోడల్ స్కూల్స్ వంటి పాఠశాలలో అనేకమంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే.

 

ALSO READWhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!

 

ఇదిలా ఉండగా గ్రూప్ -1, 2,3,4, ఎస్ ఐ, కానిస్టేబుల్ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నది. ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎంతో మంది అభ్యర్థులు ఉచిత శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు ఎంతోమంది ఉద్యోగాలు సైతం సాధించారు.

రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ రీజినల్ కోఆర్డినేటర్ జగన్మోహన్ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి వార్షిక ఆదాయం మూడు లక్షల రూపాయలకు మించకుండా ఉన్నవారు దీనికి అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 10 వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉందని చెప్పారు.

ALSO READ : 

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

Cm Revanth Reddy : బీఆర్ఎస్ కు కోలుకోలేదు దెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..!

మరిన్ని వార్తలు