Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!
చింతపల్లి, మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. రైతులు వ్యవసాయ యాంత్రికరణ 2025- 26 కు గాను సబ్సిడీపై పనిముట్లును ఉండేందుకు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఆ గ్రామాల రైతులు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని ఏవో శ్రావణ కుమారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ,ల తో పాటు 5 ఎకరాల లోపు గల జనరల్ రైతులకు అదే విధంగా మహిళా రైతులకు 50%, ఇతరులకు 40 శాతం సబ్సిడీ తో పనిముట్లు అందజేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న పనిముట్లు వివరాలు, బ్యాటరీ, మ్యానువల్ పంపులు, పవర్ స్ప్రేయర్లు, రోటవేటర్లు, సీడ్ కం ఫర్టిలైజర్స్ డ్రిల్లర్స్, డిస్క్ హీరో, కల్టివేటర్, ఎం బి ప్లవ్, బండ్ ఫార్మర్, పవర్ టిల్లర్, స్ట్రా బెల్లర్,. అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. సబ్సిడీ పై పొందడానికి రైతులు దరఖాస్తు వారంతోపాటు పట్టాదార్ పాస్ పుస్తకం,
ఆధార్ కార్డు, ట్రాక్టర్ పనిముట్ల కోసం ఆర్ సి బుక్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈనెల 13 వరకు దరఖాస్తులను ఆయా గ్రామాలలోని ఏఈఓ లకు అందించాలని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని ప్రతి ఒక్క రైతు సద్వినియోగపరచుకొని ఆమె కోరారు.
MOST READ :
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!









