TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Ponguleti SrinivasReddy : రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ సహాయం, మంత్రి పొంగులేటి వెల్లడి..!

Ponguleti SrinivasReddy : రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ సహాయం, మంత్రి పొంగులేటి వెల్లడి..!

నేలకొండపల్లి, మన సాక్షి:

వరదలతో అనేక నష్టం జరిగిందని కేంద్రం సాయం కోసం చూశాం. కానీ ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు.. అయినప్పటీకీ రైతులను ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో నూతనంగా మార్కెట్ కమిటి ప్రమాణాస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాలేరు దిగువన ఉన్న రైతులకు మంగళవారం నీటిని అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా దోచుకునే ప్రభుత్వం కాదని అన్నారు. అవినీతి నిరూపిస్తే మంత్రి కి రాజీనామా చేస్తానని అన్నారు. చాలెంజ్ కు సమాధానం లేదని అన్నారు.

హైడ్రా చితశుద్ధి తో చేసుందని అన్నారు. నా ఇలు బఫర్ జోన్ లో ఉంటే కూల్చమని ఆదేశించినట్లు తెలిపారు. ఇరువురు లో ఎవరిని ఎవరూ వెన్నుపోటు పొడుచుకుంటారు కేటీఆర్, హరీష్ రావు లు తెలుసుకోవాలని సూచించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…రూ.31 వేల కోట్లు రైతులకు ఇచ్చిన ప్రభుత్వం అన్నారు. రెండు లక్షల పైన ఉన్న వారికి కూడ రుణమాఫీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1.50 కోట్లమెట్రిక్ టన్నుల వరి పండించబోతున్నామని అన్నారు. మద్దులపల్లి మార్కెట్ కు రూ.20 కోట్ల ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ వస్తుందనిఅన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నీటిపారుదల సంస్థ మువ్వా విజయ్బాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు శాఖమూరి రమేష్, వజ్జా రమ్య, గరిడేపల్లి రామారావు, బచ్చలకూరి నాగరాజు, వల్లాల రాధాకృష్ణ, రావెళ్ల కృష్ణారావు, బోయిన వేణు, బొందయ్య, పాకనాటి కన్నారెడ్డి, కొచ్చర్ల శ్రీనివాసరావు, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు