TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. రైతు బీమాకు దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త పట్టాదారు రైతులు 2024 జూన్ 28వ తేదీ వరకు పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బీమాకు 2024 ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటివరకు కూడా రైతు బీమా చేసుకోలేకపోయిన రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలి.

కావలసిన పత్రాలు :

రైతు బీమాకు దరఖాస్తు ఫారం.

రైతు పట్టాదారు పాసుబుక్.

రైతు ఆధార్ కార్డు,

నామిని ఆధార్ కార్డు. తప్పనిసరిగా అవసరం.

అర్హతలు :

1965 ఆగస్టు 14వ తేదీ నుండి 2006 ఆగస్టు 14వ తేదీ మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకు అర్హులు.

ఆధార్ కార్డులో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

రైతు బీమా దరఖాస్తులతోపాటు గతంలో భీమా చేసుకున్న రైతుల బీమా లో మార్పులు చేర్పులు, ఆధార్ లేదా నామిని చనిపోతే మార్పులు జులై 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలతో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రుణమాఫీ పై కీలక అప్డేట్.. రెండవ విడత మాఫి ఎప్పుడంటే..!

Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Srishailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. జూరాల గేట్లు ఎత్తిన అధికారులు, పెరుగుతున్న నీటిమట్టం..!

మరిన్ని వార్తలు