TOP STORIESBreaking Newsవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

అర్వపల్లి , మన సాక్షి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయుతి లను సద్వినియోగం చేసుకొని నీటి వసతి ఉండి ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు దరఖాస్తు చేసుకోవాలని పతంజలి ఆయిల్ పామ్ క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు గౌడ్ ఒక ప్రకటన లో కోరారు.

ఎన్ ఎం ఈ ఓ -ఓ పి పథకం ను 2019-20 నుండి ఈ పథకం ద్వారా ఆయిల్ పామ్ సాగు ను ప్రోత్స హించేందుకు రైతులకు రాయుతి లు అందిస్తున్నారని 2025-26 ఆర్థిక సంవత్సరం తొ పథకం కాలం పూర్తి అవుకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ పథకం లో భాగంగా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు మొక్కలు, డ్రిప్ కు సబ్సిడీ, తోట యాజమాన్యం, అంతర పంటల సాగుకు ఎకరానికి 4200/- చొప్పున నాలుగు సంవత్సరాలకు 16800/-రైతుల అకౌంట్ లో జామచేస్తున్నారని చెప్పారు. ఒక ఎకరానికి రైతు కు 50918/- రూపాయల రాయుతి అందజేస్తామని రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భారత ప్రభుత్వం ఆగస్టు 2021లో నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (ఎన్ ఎం ఈ ఓ -ఓ పి) ను ప్రారంభించిందని . ఈ మిషన్ 2025-26 నాటికి ఆయిల్ పామ్ సాగును పెంచడానికి మరియు ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిని 11.20 లక్షల టన్నులకు పెంచేందుకు కృషి చేస్తుందన్నారు.

ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర బాగుందని, ఈ పంటకు, కోతుల, దొంగల బెడద లేదని, చీడ పీడ లు కూడా తక్కువగా నే వస్తాయని పండిన పంటను బై బ్యాక్ పద్దతిన పతాంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ వారు ఇప్పటికే తుంగతుర్తి లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నిత్యం కొనుగోలు చేస్తూన్నరని అన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో వెలుగులోకి మానవ అక్రమ రవాణా.. వెట్టి చాకిరి.. ముఠా అరెస్ట్..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

  4. Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

మరిన్ని వార్తలు